TG: రాష్ట్రంలో MPTC, ZPTC వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు, బాధ్యతలు లేవని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. MPTC, ZPTCల స్థానంలో సర్పంచులు MPPలను, MPPలే జెడ్పీ ఛైర్మన్‌ను ఎన్నుకునే పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు టాక్ . ఈనెల 23న జరిగే కేబినెట్ భేటీలో దీనిపై స్పష్టత రానుంది.