KRNL: గోనెగండ్ల మండలంలోని కైరవాడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ మొత్తాన్ని అందజేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.