TSPSC Paper Leak: టీఎస్ పీఎస్సీపేపర్ లీక్ వ్యవహారంలో రంగంలోకి దిగిన ఈడీ
TSPSC పేపర్ లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED) అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు.
TSPSC Paper Leak: TSPSC పేపర్ లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ED) అధికారులు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పేపర్ ను ముందుగానే అందుకొని విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాశారని అభియోగాలపై ఈడీ విచారణ ప్రారంభించింది. కోట్ల రూపాయలు హవాలా రూపంలో చేతులు మారినట్లు ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి(Revanthreddy) ఈడికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది.
ఈ కేసులో ప్రధాన సాక్షిగా సిట్ చెబుతున్న శంకరలక్ష్మిపై ఈడీ(ED) ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కస్ట్రోడియన్ గా ఉన్న ఆమె కంప్యూటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయినట్లు తేలటంతో ఆమె స్టేట్మెంట్(Statement)ను కీలకంగా భావిస్తోంది. శంకర్ లక్ష్మి తో పాటు టిఎస్పిఎస్సి కి చెందిన సత్యనారాయణకు ఈడి నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలంటూ వీరిద్దరికీ నోటీసులు ఇచ్చింది. కోర్టు అనుమతితో ప్రవీణ్, రాజశేఖర్ కస్టడీలోకి తీసుకోనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.