HYDకు వలసలు ఆగటం లేదు. HYD విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.