MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు, కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణంకు ఎకరం స్థలం కేటాయించాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు శుక్రవారం ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.