వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ నేతృత్వంలోని కేరళ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. వయనాడ్లో కొండచరియలు విరిగిపడి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని కోరి.. అమిత్ షాకు వినతి పత్రాన్ని అందించారు. జూలై 30న వయనాడ్లో భారీ విపత్తు సంభవించి 231 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.