GNTR: ఫిబ్రవరి 6న విడుదల కానున్న ‘చిదంబరం’ చిత్ర ప్రచారంలో భాగంగా చిత్ర బృందం నంబూరులో సందడి చేశారు. హీరో వంశీ తుమ్మల, హీరోయిన్ సంధ్య వశిష్ట, దర్శకుడు వినయ్ రత్నం పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు. మన లోపమే మన బలం అనే సందేశంతో ఈ సినిమా రూపొందిందని దర్శకుడు తెలిపారు. విద్యార్థులు హీరో, హీరోయిన్లతో సెల్ఫీలు దిగి, నృత్యాలతో ప్రాంగణంలో సందడి చేశారు.

