»Vasant Vihar House Collapses Three People Trapped After Due To Water Logging
Delhi Rains : ఒక్క రోజు వానకే నిండా మునిగిన ఢిల్లీ.. నదులుగా మారిన రోడ్లు
ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని బి బ్లాక్‌లో ఓ ఇల్లు కుప్పకూలింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లు మొత్తం నీరు చేరి కూలిపోయింది.
Delhi Rains : ఢిల్లీలోని వసంత్ విహార్‌లోని బి బ్లాక్‌లో ఓ ఇల్లు కుప్పకూలింది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న ఇళ్లు మొత్తం నీరు చేరి కూలిపోయింది. ఇల్లు కుప్పకూలినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లో ముగ్గురు కూలీలు చిక్కుకునే అవకాశం ఉందని, వారిని రక్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. విషయం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఐదుగురు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఇప్పటి వరకు ఎండ వేడిమి ఢిల్లీ ప్రజలకు ఇబ్బందిగా మారగా, ఇప్పుడు ఒక్కరోజు కురిసిన భారీ వర్షం ఢిల్లీ ప్రజలకు నరకయాతన చూపిస్తుంది. వర్షం కారణంగా పలు చోట్ల జలదిగ్బంధం నెలకొంది. వసంత్‌విహార్‌లో కూడా బురద కారణంగా ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు నలుగురు చనిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం మరణాలేవీ నిర్ధారణ కాలేదు.
శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటలకు ఈ ఇంటి గోడ కూలిపోయిందని డీఎఫ్ఎస్ అధికారులు తెలిపారు. ఘటనా స్థలానికి ఐదు ఫైర్ ఇంజన్లను రప్పించారు. క్రేన్ల ద్వారా ఇంటి శిథిలాలు తొలగిస్తున్నామని, పంపుల సాయంతో నీటిని తొలగిస్తున్నామని అధికారులు తెలిపారు. ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రజలను అసౌకర్యం నుండి రక్షించడానికి, ఢిల్లీ పోలీసులు వివిధ మార్గాల్లో ట్రాఫిక్ సలహా కూడా జారీ చేశారు. వీటిలో ధౌలా కువాన్, కమ్లా మార్కెట్, ముర్గా మండి, ఘాజీపూర్, మింటో బ్రిడ్జ్ ఉన్నాయి.
#WATCH | Delhi: Inspector Kunal, 16th Battalion NDRF says, "We received information that an under-construction building has collapsed and water has entered its basement and people are feared trapped. Our rescue operation is underway." https://t.co/25knHRR3oIpic.twitter.com/z43HKqi6H1