నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ అంటే సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్. ఆయన ట్వీట్ చేసే విషయాలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. నాగాలాండ్ అందం గురించి కానీ హ్యూమన్ బేస్డ్ ఇష్యూల గురించి ఆయన పెట్టే పోస్ట్ లు మదిని తాకుతుంటాయి. అలాంటి విషయాన్నే ఆయన మనతో పంచుకున్నారు. ఒక పిల్లవాడు తుఫాను సమయంలో తన తాత్కాలికంగా కవర్ లతో ఏర్పాటు చేసిన దుకాణాన్ని కాపాడుకుంటున్న వీడియోను మంత్రి షేర్ చేశారు.
“వయస్సు మీకు బాధ్యతలను నేర్పదు, పరిస్థితులు నేర్పుతాయి,” అని ఒక వీడియోను ట్వీట్ చేశారు. విపరీతంగా వర్షం పడుతుంది. ఒక పిల్లవాడు తుఫాను సమయంలో వాళ్ల తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న దుఖానపు కవర్ ను ఎగిరిపోకుండా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే ప్లాస్టిక్ చేర్ ఎగిరి దూరంగా పడింది. దాన్ని కూడా కొంతదూరం వెళ్లి తెచ్చుకుంటాడు. ఈ వీడియో మే 18న షేర్ చేయబడింది. పోస్ట్ చేసినప్పటి నుంచి, దాదాపు రెండు లక్షల మంది చూశారు. ఇంకా కౌంటింగ్ పెరుగుతుంది. అదనంగా, ఈ షేర్కి 10,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ఈ వీడియోపై ప్రజలు స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెట్టారు. “లవ్లీ షేర్” అని ట్విట్టర్ యూజర్లు పోస్ట్ చేసారు. “పాఠశాలల్లో బోధించని ఆచరణాత్మక పాఠాలను జీవితం బోధిస్తుంది” అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.