TG: శంషాబాద్ విమానాశ్రయం ప్రధాన హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. గర్భిణి, ఆమె తల్లితో వెళ్తున్న ఉబర్ క్యాబ్ డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ఘటప జరిగింది. దీంతో వారిద్దరికీ గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదంపై స్థానికులు వెంటనే సమాచారమిచ్చినా అంబులెన్స్ ఆలస్యంగా వచ్చినట్లు తెలుస్తోంది.