PLD: నాగార్జునసాగర్ కుడి కాలువ పరిధిలో సోమవారం నుంచి వారాబంది అమలు చేస్తున్నట్లు పిడుగురాళ్ల నీటిపారుదల శాఖ డీఈ ఆదినారాయణ తెలిపారు. దీని ప్రకారం జూలకల్లు బ్రాంచ్ పరిధిలోని తంగెడ, ఆకురాజుపల్లి మేజర్ కాలువలకు ఈ నెల 5 నుంచి 13 వరకు నీటి సరఫరా ఉంటుంది. తిరిగి 14 నుంచి 19 వరకు నీటి విడుదల నిలిపివేస్తారు. ఈ విధానం ఇకపై నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు.