MDCL: అల్వాల్ సర్కిల్ ప్రజావాణిలో బీజేపీ నాయకులు పలు సమస్యలపై అర్జీలు సమర్పించారు. రోడ్లపై చిన్నచితకా వ్యాపారాల వల్ల బాటసారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని డీసీ భోగేశ్వర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటాపురం కొత్తబస్తీ అంబేద్కర్ భవన్‌ను నామమాత్రపు రుసుముతో అందుబాటులో ఉంచాలని, భవనంలో విద్యుత్, నీటి సమస్యలు, బోర్వెల్ను మరమ్మతు చేయాలని బస్తీవాసులు కోరారు.