UPలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ముఖేశ్ పటేల్‌కు ప్రయాగ్‌రాజ్ అడిషనల్ సెషన్స్ జడ్జి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చారు. ఉరిశిక్షతో పాటు నిందితుడికి కోర్టు రూ.25,000 జరిమానా విధించింది. ఆ జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది.