Video Viral : ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. బస్సులోనే చిక్కుడు కాయలు వలుస్తున్న మహిళ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మహిళలు బాగా వినియోగిస్తున్నారు. ప్రీ బస్సు ప్రయాణాన్ని మామూలుగా వాడడం లేదు.
Video Viral : కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని మహిళలు బాగా వినియోగిస్తున్నారు. ప్రీ బస్సు ప్రయాణాన్ని మామూలుగా వాడడం లేదు. రూ.5తక్కువని కూరగాయల కోసం కొందరు మహిళలు 20కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. మరికొందరైతే చాయ్ తాగేందుకు కొందరు మహిళలు ఏకంగా 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
అదీకాక ఈమధ్య ఎంచక్కా బస్సులో కూర్చొని బీడీలు కట్టుకునే ఆడవాళ్ళని చూశాం. బస్సుల్లో మహిళలు చేస్తున్న విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల బస్సులో కూర్చొని కండక్టర్‌కు ఆధార్‌కార్డు చూపుతుండగా, అవతలివైపు ఓ మహిళ కవర్ లోంచి చిక్కుడుకాయను తీసి తుంచుతోంది ఓ మహిళా.
ఎక్కడ జరిగిందో తెలియదు కానీ బస్సులో ప్రయాణిస్తున్న మరొకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్ల మహిళలు.. ఇలాంటివి మరెవరికీ సాధ్యం కాదంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.