AKP: చోడవరం నియోజకవర్గ అభివృద్ధికి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.304.58 కోట్ల ఔట్రీచ్ బడ్జెట్‌ను ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ప్రకటించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. గ్రామీణాభివృద్ధికి రూ.100.36 కోట్లు, మహిళా-శిశు సంక్షేమానికి రూ.32.74 కోట్లు, గృహనిర్మాణానికి రూ.24.37 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.22.67 కోట్లు కేటాయించారు.