NGKL: పదర మండలం మద్దిమడుగులో కొలువుదీరిన శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 2 వరకు ఘనంగా జరగనున్నాయి. 31న శివపార్వతుల కళ్యాణం, ఏప్రిల్ 1 న సీతారాముల కళ్యాణం, హోమాలు, గరుడ వాహన సేవ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ పాలక మండలి కోరింది.