VZM: మద్యానికి బానిసైన భర్తను భార్య మందలించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయనగరంలో జరిగింది. వన్ టౌన్ ఎస్సై ఎస్సై అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్‌కు చెందిన బెవర శ్రీనివాస్ (28) కూలీ పనులు చేస్తు జీవనం సాగించే వాడు. మద్యానికి బానిస కావడంతో ఆయన భార్య రేవతి మందలించింది.