KMM: ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణ కోసం ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని వైరా ఏసీపీ సారంగపాణి అన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇవాళ వైరాలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ వైరా పట్టణంలో నిర్వహించారు. మనకోసం, మన ఇంటి వాళ్లు ఎదురు చూస్తుంటారని, మన ప్రాణాలు మన కుటుంబానికి ఎంతో ముఖ్యమని గుర్తించుకోవాలని కోరారు.