తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ పెరగడంతో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను నిలిపివేస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు.
TSRTC: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది. దీనివల్ల ప్రయాణికుల రద్దీ పెరగడంతో గ్రేటర్ హైదరాబాద్లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను నిలిపివేస్తున్నట్లు వీసీ సజ్జనార్ తెలిపారు. 2024 జనవరి 1 నుంచి ఈ టికెట్లను పూర్తిగా నిలిపి వేస్తున్నట్లు తెలియజేశారు. ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూసి, వారి వయస్సును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. దీనివల్ల ప్రయాణికులకు అసౌకర్యం కలుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది.
ప్రయాణికులకు ముఖ్య గమనిక! మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు…