అన్నమయ్య: రామసముద్రం మండల కేంద్రంలోని దిగుపేటలో అనుమానాస్పద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. చాంద్ బాషా ఇంటి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు రాత్రివేళ పూజలు నిర్వహించినట్లు సమాచారం. కోడి కాళ్లు, పసుపు, కుంకుమ, దారాలు నల్ల కవర్లో పెట్టి వదిలివెళ్లడంతో ఉదయం గమనించిన కుషిద్ బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.