Manisha Padhi: మహిళలు ఎక్కువగా టీచర్, డాక్టర్ వంటి ఉద్యోగాలే బెటర్. ఆర్మీ వంటి ఉద్యోగాలు వాళ్లకు కరెక్ట్ కాదని కొందరు అభిప్రాయ పడుతుంటారు. ప్రస్తుతం ఎలాంటి లింగ బేధం లేకుండా అమ్మాయిలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. మిజోరంలో జన్మించిన మనీషా పాధి ఇటీవల అసిస్టెంట్ డి క్యాంప్ (ADC)గా నియమితులయ్యి చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలి మహిళా ఏడీసీగా మనీషా గుర్తింపు పొందింది. మిజోరం గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభపాటి ఈమెను మహిళా సహాయకురాలిగా నియమించారు. 2015 బ్యాచ్ ఎయిర్ ఫోర్స్ అధికారిణి మనీషా పాధిని నియమించారు. దేశంలో ఈమె మొదటి మహిళా సహాయకురాలు.
ఏడీసీ అంటే గవర్నర్‌కు వ్యక్తిగత సహాయకురాలిగా అధికారిక పర్యటనలో కూడా వెంట ఉంటారు. ప్రతి గవర్నర్‌కు ఇద్దరు ఏడీసీలు ఉంటారు. ఒకరు సాయుధ దళాల అధికారి అయితే మరొకరు పోలీసు అధికారి. ఇంతకు ముందు మనీషా పాధి మూడు కీలక పదవులు నిర్వహించారు. ఈమె నియామకం ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కావాలని గవర్నర్ కొనియాడారు. ఒడిశాలోని బరంపూర్‌కు చెందిన మనీషా భర్త కర్కీ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. భువనేశ్వర్‌లోని CV రామన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తర్వాత 2015లో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఏఐఎఫ్‌లో చేరారు.