TG: ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకం తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విదేశాల్లో నిపుణులైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. గోషామహల్లో 30 ఎకరాల్లో రూ.3 వేల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామని, పనులు వేగంగా జరిగేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామన్నారు.