»Running Time Of Animal Movie Giving A Shock Like Arjun Reddy
Arjun Reddyలాగే షాక్ ఇస్తున్న’యానిమల్’ రన్ టైం?
అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి(sandeep reddy vanga).. ఈ సినిమా మొత్తం ఫుటేజ్‌ను దాదాపు ఐదు గంటలు షూట్ చేశాడు. ఇక ఇప్పుడు యానిమల్ విషయంలోను షాకింగ్ రన్ టైం అని తెలుస్తోంది.
Running time of Animal movie giving a shock like Arjun Reddy
డిసెంబర్ 22న సలార్ రాక కోసం పాన్ ఇండియా లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కానీ అంతకంటే.. డిసెంబర్ 1 కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే.. ఆ రోజు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(sandeep reddy vanga) నుంచి ‘యానిమల్(animal)’ సినిమా ఆడియెన్స్ ముందుకు రానుంది. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెంచేశాయి. ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తాడని అనుకుంటున్నారు.
అయితే ఈ సినిమా రన్ టైం(run time) మాత్రం షాక్ ఇచ్చేలా ఉంది. వాస్తవానికైతే అర్జున్ రెడ్డి సినిమాను దాదాపు ఐదు గంటలు వచ్చేలా షూట్ చేశాడు సందీప్. కానీ థియేటర్లో ఇంత రన్ టైం వర్కౌట్ కాదు కాబట్టి.. మూడు గంటల రన్ టైంతోనే రిలీజ్ చేశాడు. కానీ అర్జున్ రెడ్డిని ఎలాంటి కట్స్ లేకుండా త్వరలోనే రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు. అయితే ఇప్పుడు యానిమల్ మూవీ కూడా మూడున్నర గంటల లెంగ్త్‌తో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోను ఈ సినిమాను ఇదే రన్ టైంతో రిలీజ్ చేయాలని.. సందీప్ డిసైడ్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
దీంతో అసలు ఫుటేజ్ ఎంత అనే చర్చ జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఫైనల్ రన్ టైం వచ్చేసి మూడు గంటల పది నిమిషాలుగా లాక్ చేసినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక క్లారిటీ రానుంది. అయినా కూడా.. ఈ రన్ టైంతో యానిమల్ రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. రెండున్నర గంటలు ఆడియెన్స్‌ను థియేటర్లో కూర్చోబెట్టడమే కష్టంగా ఉన్న సమయంలో.. మూడు గంటల పది నిమిషాలు అంటే మాటలు కాదు సందీప్.. అని నెటిజన్స్ కామెంట్స్(comments) చేస్తున్నారు.