SRPT: లాకప్‌లో మరణించిన కర్ల రాజేష్ కేసు విచారణలో భాగంగా డీఎస్పీ రవి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో కలిసి సోమవారం బాధితుని తల్లి, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాజేష్ రీ-పోస్టుమార్టం నివేదికతో కూడిన సమగ్ర విచారణ జరుగుతోందని, మరో నాలుగు, ఐదు రోజులలో పూర్తి రిపోర్టు అందిస్తామని వారు వెల్లడించారు.