KMR: ఆపదలో నేను సైతం ఉన్నానంటూ రక్తదాతల సమూహ నిర్వాహకుడు బోనగిరి శివకుమార్ 50వ సారి రక్తదానం చేశారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఎనిమియాతో బాధపడుతూ చికిత్స పొందుతున్న దోమకొండకు చెందిన వ్యక్తికి O పాజిటివ్ రక్తం మూడు యూనిట్ల అవసరమయ్యింది. దీంతో విషయం తెలుసుకున్న ఆయన కామారెడ్డి బ్లడ్ సెంటర్కి వెళ్లి రక్తదానం చేశారు.