E.G: జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో సోమవారం PGRS, రెవెన్యూ క్లినిక్ యథావిధిగా జరుగుతాయని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు హాజరై ప్రజల నుంచి PGRS అర్జీలు స్వీకరిస్తారన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తమ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు అందజేసి పరిష్కరించుకోవాలన్నారు.