SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇబ్రహీంబాద్కు చెందిన చిన్నారి చికిత్సకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.3,89,228 చెక్కును మంజూరు చేపించారు. ఇవాళ ఎమ్మెల్యే తన కార్యాలయంలో బాధిత కుటుంబానికి చెక్కు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సహాయం అందించడం తమ బాధ్యత అని తెలిపారు. స్థానిక నాయకులు ఉన్నారు.