AP: నెల్లూరులో మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. నారాయణ నేత్రజ్యోతి – దంత సురక్ష పేరుతో వైద్యశిబిరాలను చేపట్టారు. 12 రోజులుగా 1316 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. తొలి విడతలో 230 మందికి ఉచితంగా కంటి అద్ధాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేయిస్తామని చెప్పారు.