PDPL: ప్రతి మనిషి ఉన్నదానిలో తృప్తి పొందాలని బ్రహ్మకుమారి అంజలి బెహన్ అన్నారు. రామగుండం సింగరేణి సంస్థ GM ఆఫీస్‌లో ఉద్యోగులకు నిత్య జీవితంలో ఒత్తిడికి కారణాలు-నివారణ మార్గాలపై గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పొంది అనుకున్నది సాధిస్తామని అన్నారు. వయసును అనుసరించి ఆహారపు అలవాట్లు ఉండాలని ఆమె సూచించారు.