ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS) విజయానంద్ అధ్యక్షతన ఉన్నతాధికారులతో కీలక సమావేశం జరగనుంది. జనాభా లెక్కల సేకరణ-2027 అంశంపై జరిగే ఈ రాష్ట్రస్థాయి భేటీలో ప్రక్రియ సన్నద్ధతపై విస్తృతంగా చర్చించనున్నారు. ఈ మేరకు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు ఈ సమావేశం సాగనుంది.