NTR: విజయవాడలో APPSC గ్రూప్-2 ద్వారా ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లుగా ఎంపికైన 150 మందికి మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని చట్టబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించడంలో కొత్తగా బాధ్యతలు చేపడుతున్న అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.