బీర్ల విక్రయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే చారిత్రక లార్డ్స్ స్టేడియంలో త్వరలో బీర్ల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. సరఫరాదారు బ్రూడాగ్ తో ఒప్పందం ముగియడంతో మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త బ్రాండ్‌తో ఒప్పందం కుదిరినా, అది అందుబాటులోకి రావడానికి సమయం పట్టనుంది. దీంతో తదుపరి మ్యాచ్‌ల వరకు స్టేడియంలో మద్యం సరఫరా ఉండదని అధికారులు స్పష్టం చేశారు.