AP: జనసేన ఎమ్మెల్యే బాధితురాలికి కూటమి ప్రభుత్వం ఏం న్యాయం చేసిందో చెప్పాలని మాజీమంత్రి పేర్నినాని డిమాండ్ చేశారు. మహిళలకు అన్యాయం చేసిన వాడికి అదే ఆఖరి రోజు అని పదేపదే చెప్పుకుని తిరిగే సీఎం చంద్రబాబు.. ఆ బాధిత మహిళకు ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. ఆ కూటమి ఎమ్మెల్యేని శిక్షించకపోగా తిరిగి బాధితురాలిపైనే కేసులు పెట్టి వేధించింది మీరు కాదా? అని మండిపడ్డారు.