కృష్ణా: మాజీ మంత్రి పేర్ని నాని మంత్రి పయ్యావుల కేశవ్పై శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ.. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. లెక్కలు, కాగితాలు అవసరం లేదని, ఆర్థికశాఖ కార్యదర్శి సంతకంతో స్టేట్మెంట్ విడుదల చేయించగలరా అని ప్రశ్నించారు. పయ్యావుల ఆర్థిక మంత్రి కాదని, అప్పుల మంత్రి అని అన్నారు.