భారీ అంచనాల నడుమ వస్తున్న ‘ధురంధర్-2’ టికెట్ ధరల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లో ఒక ప్రత్యేక స్క్రీన్ కోసం టికెట్ ధరను రూ.3,100గా నిర్ణయించారు. బుక్ మై షో ఛార్జీలతో కలిపి ఇది రూ.3,145కి చేరుతుంది. కేవలం 42 సీట్లు ఉన్న ఈ స్క్రీన్లో ప్రీమియర్స్ కోసం ఈ ధర ఫిక్స్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో రేట్లు రూ.800 వరకు ఉన్నాయి.