AP: మచిలీపట్నంలో మాజీమంత్రి పేర్ని నాని ఇంటి సమీపంలో జనసేన, YCP శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రామానాయుడు సెంటర్లో జనసేన జెండా దిమ్మెను YCP నేతలు అడ్డుకున్నారు. జనసేన నేత శివయ్యపై YCP నాయకులు విఠల్, సుబ్బన్న దాడికి యత్నించారు. దీంతో అప్రమత్తమైన జనసైనికులు ఈ దాడి ప్రతిఘటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు.