TG: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం ఎల్కిచర్లలో ఘోరం జరిగింది. రెండో బోరు వేసే విషయంలో భర్తతో జరిగిన వివాదంతో ఆవేశానికి గురైన జంగమ్మ.. తన ముగ్గురు పిల్లలతో కలిసి బావిలో దూకింది. ఈ ఘటనలో తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, శైలజ ప్రాణాలు కోల్పోయారు. అయితే, కుమారుడు జస్వంత్ చాకచక్యంగా బావి అంచును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు.