PDPL: మంథని మండల ప్రజా పరిషత్తు ఆవరణలో బోరు మోటారు వద్ద పైపు లీకేజీతో నీరు వృథాగా పోతుంది. దీంతో పక్కనే ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా తయారైంది. కార్యాలయ అవసరాలకు నీటి సరఫరా చేసే క్రమంలో మోటార్ వద్ద పైపు లీకేజీ కారణంగా నీరు పోతూ.. బురదమయంగా ఉందని స్థాపనికులు తెలిపారు. వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.