ఒకప్పుడు నిర్మాతలు పంపిణీకి దూరంగా ఉండేవారు.. కానీ సితార నాగవంశీ ప్రస్తుతం అటు నిర్మాతగా, ఇటు డిస్ట్రిబ్యూటర్గా రాణిస్తున్నాడు. నాగచైతన్య ‘వృషకర్మ’ చిత్ర ఏపీ, TG, కర్ణాటక హక్కులను నాగవంశీ ఏకంగా రూ.45 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. గతంలో ‘వార్ 2’తో నష్టాలు చూసిన ఆయన.. ఇప్పుడు ఈ సినిమాపై ఇంత పెద్ద మొత్తంలో రిస్క్ చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.