MHBD: సీరోలు మండలం చింతపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం పదవతరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం జరిగింది. ప్రభుత్వవిప్, డోర్నకల్ ఎమ్మెల్యే డా.రాంచందర్ నాయక్ ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, సామాగ్రి పంపిణీ చేశారు. ఈనెల 14 నుంచి జరిగే పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని MLA వారికి సూచించారు.