HYD: మూసీ ప్రాజెక్టుపై అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. గాంధీ సరోవర్ వరకు సుమారు 21 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన డీపీఆర్ సిద్ధం చేసేందుకు చర్యలు చేపట్టారు. నది శుద్ధి, వరద నియంత్రణ, పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజలకు వినోద, మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందిస్తున్నారు.