TG: సింగూరు, మంజీరా డ్యామ్లు కాంగ్రెస్ హయాంలో నిర్మించారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ప్రజలకు సింగూరు, మంజీరా డ్యామ్ల ద్వారా తాగు నీరు సరఫరా అవుతుందని తెలిపారు. ఆ డ్యామ్ నీళ్లు తాగలేదని బీఆర్ఎస్ నేతలు చెప్పగలరా అని నిలదీశారు. ఏపీ నీళ్ల దోపిడీ అంటూ బీఆర్ఎస్ మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతోందని మండిపడ్డారు.