ATP: అనంతపురం మార్కెట్ యార్డ్‌లో బుధవారం పండ్ల వ్యాపారస్తులు, రైతు సంఘం ప్రతినిధులతో ఛైర్పర్సన్ బల్లా పల్లవి సమావేశమయ్యారు. పెండింగ్‌లో ఉన్న షాపుల అద్దెలను ఈ నెలలోపు చెల్లించాలని, గడువు ముగిసిన ట్రేడర్ లైసెన్స్‌లను వెంటనే రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. బకాయిలు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.