TG: కేంద్ర మాజీమంత్రి కావూరి సాంబశివరావు (82) కన్నుమూశారు. హైదరాబాద్లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్లో కావూరి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఏపీలోని మచిలీపట్నం, ఏలూరు నుంచి కావూరి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్రమంత్రిగా పనిచేశారు.