NGKL: నాగర్కర్నూల్ జిల్లా శ్రీపురం రోడ్లోని ఆర్ట్స్ కళాశాలలో రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. దాదాపు 10 కంపెనీలు పాల్గొనే ఈ మేళాలో డిగ్రీ పూర్తి చేసిన వారితో పాటు చదువుతున్న విద్యార్థులు కూడా పాల్గొనవచ్చని ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.