NTR: మా గుండెలను మరొక్కసారి తాకిపో తాతా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు నివాళులు అర్పిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
తెలుగు దిగ్గజ నటుడు, దివంగత నేత నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao) శతజయంతి సందర్భంగా తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్(junior Ntr Emotional Tweet) ఎమోషనల్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా నందమూరి తారక రామారావుకు నివాళి అర్పించి ఆయనతో ఉన్న గుర్తులను తలచుకున్నారు. ఈ సందర్భంగా తాతను తలచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది. మీరూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను. నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao)’ అంటూ తారక్ ఎమోషనల్ ట్వీట్(junior Ntr Emotional Tweet) చేశారు. ప్రస్తుతం తారక్ ట్వీట్ నెట్టిం వైరల్ అవుతోంది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాతకు నివాళులు అర్పిస్తున్న తారక్:
నందమూరి తారకరామారావు(Nandamuri Taraka Ramarao)కు సోషల్ మీడియా వేదికగా చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. ఒక శతాబ్దపు అద్భుతం నందమూరి తారకరామారావు. గొప్ప నటుడు. గొప్ప నాయకుడు. గొప్ప మనసున్న మనిషి. శతజయంతి సందర్భంగా ఆయనకివే ఘన నివాళి అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.