W.G: నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఛైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకట రమణ తెలిపారు. మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాలులో జరిగే ఈ సమావేశానికి సభ్యులు, సంబంధిత అధికారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని కోరుతూ ఆమె సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.