E.G: తాళ్లపూడి మండలం పైడిమెట్ట లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి స్టేజ్ దగ్గర ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ తో ట్రాన్స్ ఫార్మర్ దగ్ధమైంది. ఈ మేరకు నూతన ట్రాన్సఫర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.9 లక్షల 75 వేల చెక్కును కమిటీ సభ్యులకు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో జొన్నలగడ్డ సుబ్బారాయ చౌదరి, రామకృష్ణ పాల్గొన్నారు.