WNP: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తూ మార్గదర్శకంగా నిలుస్తున్నారని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సోమవారం వనపర్తి కలెక్టరేట్లో మహిళ అధికారులను శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు.