KDP: పులివెందుల అర్బన్ సీఐ శ్రీరామ్ ఇవాళ బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా పోలీస్ స్టేషన్లో కంప్లెంట్ చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి 100% న్యాయం చేస్తామన్నారు. కుల, మత, వర్గ భేదం లేకుండా ఎవరి వైపు న్యాయం ఉంటే వారి వైపు తప్పక నిలబడతానని హామీ ఇచ్చారు.